madya pradesh: ఎన్నికలకు ముందు మధ్యప్రదేశ్ లో హిందూ మతాధినేతలకు మంత్రి హోదా!

  • మధ్యప్రదేశ్ సర్కారు అసాధారణ నిర్ణయం
  • నర్మదా పరిరక్షణ కమిటీ ఏర్పాటు చేసి అందులో వారికి చోటు
  • ఎన్నికల్లో లబ్ధి పొందే చర్యగా కాంగ్రెస్ విమర్శ

మధ్యప్రదేశ్ సర్కారు ఎన్నికలకు మరో ఆరు నెలల సమయం ఉందనగా, హిందువుల ఓట్లను గెలుచుకునే యత్నాలు మొదలు పెట్టింది. ఇందులో భాగంగా ఐదుగురు హిందూ మత పెద్దలకు సహాయ మంత్రిత్వ హోదా కట్టబెట్టింది. నర్మదా నది పరిరక్షణ పేరుతో ఓ కమిటీని ఏర్పాటు చేసి అందులో ఈ ఐదుగురికి చోటిచ్చింది. ఆ తర్వాత వారికి సహాయ మంత్రిత్వ హోదా ఇచ్చింది.

నర్మదానంద మహారాజ్, హరిహరానంద మహరాజ్, కంప్యూటర్ బాబా, యోగేంద్ర మహంత్, భయ్యూ మహరాజ్ కు ఈ గౌరవం దక్కింది. కమిటీ సభ్యులు కావడంతో సహాయ మంత్రి హోదా ఇచ్చినట్టు ప్రభుత్వం తన చర్యను సమర్థించుకుంది. అయితే, దీన్ని ఎన్నికల్లో లబ్ధి పొందే గిమ్మిక్కుగా కాంగ్రెస్ పార్టీ విమర్శించింది.

More Telugu News