sri reddy: శ్రీరెడ్డిపై టాలీవుడ్‌ ఫిలిం ఛాంబర్‌ ప్రతినిధి కల్యాణ్ పోలీసులకు ఫిర్యాదు

  • సినీ పరిశ్రమలోని చీకటి వ్యవహారాలపై గొంతెత్తిన శ్రీరెడ్డి
  • కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తోందంటూ ఆమెపై ఫిర్యాదు
  • ప్రసారమాధ్యమాల్లో ఇష్టానుసారం మాట్లాడుతోందని ఆరోపణ
వివాదాస్పద వ్యాఖ్యలతో తెలుగు చిత్రపరిశ్రమలో నెలకొన్న చీకటి వ్యవహారాలపై గొంతెత్తిన శ్రీరెడ్డిపై టాలీవుడ్‌ ఫిలిం ఛాంబర్‌ ప్రతినిధి కల్యాణ్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత కొంత కాలంగా శ్రీరెడ్డి తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ప్రముఖులు, నటులను కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తోందని, ఆమెపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో ఆయన సైబర్ క్రైమ్ పోలీసులను కోరారు.

 ప్రసార మాధ్యమాల్లో ఆమె ఇష్టానుసారం మాట్లాడుతూ టాలీవుడ్ ప్రతిష్ఠను దిగజారుస్తున్నారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా, ఫిర్యాదును పరిశీలించిన సైబర్ క్రైమ్ పోలీసులు, దానిని న్యాయ నిపుణుల పరిశీలనకు పంపించారు. వారి సలహా మేరకు దానిపై చర్యలు తీసుకోనున్నారు. 
sri reddy
Tollywood film chamber
Pawan Kalyan

More Telugu News