Narendra Modi: ‘మోదీ అత్యంత పిరికిపంద’ అంటూ మంత్రి జవహర్ తీవ్ర వ్యాఖ్యలు

  • తమిళనాడు తరహా రాజకీయాలు ఏపీలో చేయాలని చూస్తే కుదరదు
  • బెదిరించి లొంగదీసుకోవాలని మోదీ చూస్తున్నారు
  • బీజేపీ కొత్త స్నేహం కుదుర్చుకుంది

ప్రధాని నరేంద్ర మోదీ దేశంలోనే అత్యంత పిరికిపందంటూ ఏపీ మంత్రి జవహర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘ఏబీఎన్’లో నిర్వహించిన చర్చా కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఏపీలో తమిళనాడు తరహా రాజకీయాలు చేయాలని చేస్తే కుదరదని, బెదిరించి లొంగదీసుకోవాలని చూస్తున్నారని మోదీపై ఆయన మండిపడ్డారు. బీజేపీ కొత్త స్నేహం కుదుర్చుకుందని, ప్రధాన మంత్రి కార్యాలయాన్ని సైతం వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రలోభపెడుతున్నారని విమర్శించారు. ఈ సందర్భంగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై ఆయన నిప్పులు చెరిగారు. ఏపీకి ఈ రెండు పార్టీలు అన్యాయం చేశాయని అన్నారు.

  • Loading...

More Telugu News