ntr: రాజమౌళితో సినిమాపై తొలిసారి స్పందించిన జూ.ఎన్టీఆర్

  • రాజమౌళి ఇంకా కథ పూర్తిగా చెప్పలేదు
  • సినిమాకు సిద్ధం కావాలని అన్నారు
  • క్రికెటర్ల జీవితాలు తెరపై రావడం సంతోషంగా ఉంది
  • వారి బయోపిక్స్ చేయడానికి నేను సాహసించను

యంగ్ హీరోలు రామ్ చరణ్ తేజ్, జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు రాజమౌళి కాంబినేషన్‌లో ఓ సినిమా రూపుదిద్దుకోనుందన్న వార్త హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. ఆ సినిమాపై జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. రాజమౌళి ఇంకా ఆ సినిమా కథ పూర్తిగా చెప్పలేదని, సినిమాకు సిద్ధం కావాలని అన్నారని వ్యాఖ్యానించారు.

ఐపీఎల్ మ్యాచుల తెలుగు ప్రచార‌క‌ర్త‌గా ఎన్నికైన‌ జూనియ‌ర్ ఎన్టీఆర్ ఈ రోజు ఐపీఎల్ నిర్వాహ‌కులు హైద‌రాబాద్‌లోని పార్క్ హయత్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ... ఎన్టీఆర్ బయోపిక్ నుంచి తనకు ఎలాంటి పిలుపు రాలేదని చెప్పారు. కాగా, క్రికెటర్ల జీవితాలు తెరపై రావడం సంతోషంగా ఉందని, అయితే, వారి బయోపిక్స్ చేయడానికి తాను సాహసించనని చెప్పారు.

More Telugu News