Chandrababu: ఎన్డీయే నుంచి బయటకు రావడానికి కారణం ఇదే: జాతీయ మీడియాతో చంద్రబాబు

  • బీజేపీ, వైసీపీ మధ్య సత్సంబంధాలు కొనసాగుతున్నాయి
  • అందుకే ఎన్డీయే నుంచి బయటకు వచ్చాం
  • పీఎంఓను వైసీపీ నేతలు ఇష్టం వచ్చినట్టు వాడుకుంటున్నారు
అవినీతి పార్టీ అయిన వైసీపీతో కొనసాగాలని బీజేపీ నిర్ణయం తీసుకుందని... అందుకే తాము ఎన్డీయే నుంచి బయటకు వచ్చామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. బీజేపీ, వైసీపీల మధ్య సత్సంబంధాలు కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రధాని కార్యాలయాన్ని వైసీపీ నేతలు ఇష్టం వచ్చినట్టు వాడుకుంటున్నారని విమర్శించారు.

ఢిల్లీలో జాతీయ మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో ఇకపై ఎలాంటి సంబంధాలు ఉండబోవని ఆయన స్పష్టం చేశారు. కేవలం రాష్ట్ర విభజన అంశాలపై మాట్లాడేందుకే తాను ఢిల్లీకి వచ్చానని... జాతీయ రాజకీయాలు, ఇతర అంశాలపై మాట్లాడేందుకు ఇది సరైన సమయం కాదని అన్నారు. పోలవరం ప్రాజెక్టుకు, వెనుకబడిన జిల్లాలకు నిధులను ఇచ్చినట్టే ఇచ్చి వెనక్కి తీసుకుందంటూ కేంద్రంపై మండిపడ్డారు. 
Chandrababu
national media
pmo
YSRCP
BJP

More Telugu News