roja ramani: షూటింగ్ లేకపోతే ఏడ్చేసేదానిని: సీనియర్ నటి రోజా రమణి

  • షూటింగ్స్ కి వెళ్లడం బాగా అలవాటైపోయింది 
  • మా నాన్నగారు కూడా యాక్టింగ్ మానేయమన్నారు
  • అదే సమయంలో హీరోయిన్ గా ఛాన్స్ వచ్చింది  

రోజా రమణి పేరు వినగానే 'భక్త ప్రహ్లాద' సినిమా గుర్తుకు వస్తుంది. ఆ సినిమాలో ఆమె చేసిన హావభావ విన్యాసాలు గుర్తుకు వస్తాయి. అలాంటి రోజారమణి తాజాగా 'ఆలీతో సరదాగా'లో మాట్లాడుతూ, తన కెరియర్ కి సంబంధించిన అనేక విషయాలను చెప్పుకొచ్చారు. " ఊహ తెలిసిన దగ్గర నుంచి నాకు స్టూడియో .. మేకప్ .. లైట్స్ .. కాస్ట్యూమ్స్ అలవాటైపోయాయి"

"అందువలన ఒక్క రోజు షూటింగ్ లేకపోయినా ఏదో కోల్పోయినట్టుగా ఉండేది. దాంతో నన్ను షూటింగుకి తీసుకెళ్లమని ఏడ్చేసేదానిని. ఏ కారణంగా షూటింగ్ లేకపోయినా ఆ రోజంతా నీరసించిపోయేదానిని. షూటింగ్ అంటే నాకు అంత ఇష్టం. అలాంటి పరిస్థితుల్లో మా నాన్నగారు పిలిచి .. ఇక యాక్టింగ్ మానేయమన్నారు. కొన్నాళ్లపాటు చదువుకుని .. ఆ తరువాత పెళ్లి చేసుకోమన్నారు. దాంతో నేను ఒక్కసారిగా షాక్ అయ్యాను. అలాంటి పరిస్థితుల్లోనే మలయాళం మూవీ 'చంబరత్తి'లో ఛాన్స్ వచ్చింది. ఆ సినిమా సక్సెస్ నా కెరియర్ ను మలుపు తిప్పేసింది.   

More Telugu News