palaniswamy: నిరాహార దీక్ష చేపట్టిన పళని, పన్నీర్.. నిప్పులు చెరిగిన స్టాలిన్

  • కావేరి మేనేజ్ మెంట్ బోర్డు కోసం నిరాహారదీక్ష
  • చేపాక్ లో దీక్షకు కూర్చున్న సీఎం, డిప్యూటీ సీఎం
  • సుప్రీం ఆదేశించినా ఇంతవరకు స్పందించని కేంద్ర ప్రభుత్వం
కావేరి మేనేజ్ మెంట్ బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐఏడీఎంకే పార్టీ నేతలు, కార్యకర్తలు నిరాహారదీక్షను చేపట్టారు. సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ కేంద్రం కావేరీ బోర్డును ఏర్పాటు చేయలేదని ఆరోపిస్తూ దీక్షకు దిగారు. ఈ నేపథ్యంలో చెన్నైలోని చేపాక్ లో ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంలు నిరాహారదీక్షలో పాలుపంచుకున్నారు.

వాస్తవానికి నిరాహారదీక్ష చేపడుతున్న వ్యక్తుల జాబితాలో వీరిద్దరి పేర్లు లేవు. కానీ ఈ ఉదయం 8.15 గంటలకే నిరాహారదీక్ష వేదిక వద్దకు చేరుకున్న వీరు... దీక్షలో కూర్చున్నారు.  మరోవైపు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి నిరాహారదీక్షలో పాల్గొనడంపై డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ మండిపడ్డారు. ఆరువారాల్లోగా కావేరి మేనేజ్ మెంట్ బోర్డును ఏర్పాటు చేయాలంటూ ఫిబ్రవరి 16న కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది.

palaniswamy
pannerselvam
stalin
kaveri managemetn board

More Telugu News