assembly: ఏపీలో 80 శాతం మంది కాపులు పవన్ వైపే ఉన్నారు!: బీజేపీ నేత మాణిక్యాల‌రావు

  • క‌ర్ణాట‌క ఎన్నిక‌ల్లో బీజేపీ గెలుపు ఖాయం
  • పవన్ వారిని ఎలా వినియోగించుకుంటారో చూడాలి
  • మాకు అసెంబ్లీలో మాట్లాడే అవ‌కాశం ఇవ్వడం లేదు
బీజేపీకి వ్యతిరేకంగా టీడీపీ కొన్ని టీములను కర్ణాటకకు పంపిందని, ఎవరెన్ని కుట్రలు చేసినా తమ పార్టీ కర్ణాటకలో గెలిచితీరుతుందని బీజేపీ ఏపీ ఎమ్మెల్యే పైడికొండల మాణిక్యాల‌రావు ఆరోపించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో 80 శాతం మంది కాపులు పవన్ వైపే ఉన్నారని, పవన్ వారిని ఎలా వినియోగించుకుంటారో చూడాలని అన్నారు.

టీడీపీ అవినీతిపై పవన్ కల్యాణ్ మాట్లాడిన తరువాత ఆ విషయం జనంలోకి బాగా వెళ్లిందని అన్నారు. కొన్ని రోజులుగా బీజేపీపై టీడీపీ చేస్తోన్న వాదనలు ప్రజల్లోకి వెళ్లడం లేదని అన్నారు. కాగా, తమకు అసెంబ్లీలో మాట్లాడే అవ‌కాశం ఇవ్వడం లేదని, తాము పలు అంశాలపై ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలనుకుంటున్నామని తెలిపారు.
assembly
manikyala rao
BJP

More Telugu News