Chandrababu: నన్ను జైలుకు పంపించేందుకు టీడీపీ కుట్ర చేస్తోంది: విజయసాయిరెడ్డి

  • ఢిల్లీలో చంద్రబాబును ఎవరూ లెక్క చేయడం లేదు
  • నేను ఎప్పటికీ వైయస్ కుటుంబసభ్యుడినే
  • లోకేష్ కు హైదరాబాదులో ఏం పని?
ఢిల్లీలో చంద్రబాబు ప్రవర్తన చూస్తుంటే మళ్లీ యూటర్న్ తీసుకుంటారనే భయం కలుగుతోందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. పార్లమెంటులో అందరి చేతులు పట్టుకుని చంద్రబాబు బతిమిలాడుతున్నారని... ఆయనను ఎవరూ లెక్క చేయడం లేదని చెప్పారు. చంద్రబాబును కలవాలంటూ టీడీపీ ఎంపీలు ఇతర పార్టీల నేతలను వేడుకుంటున్నారని తెలిపారు.

గతంలో ప్రత్యేక హోదా వద్దు, ప్యాకేజీ ఇవ్వాలని టీడీపీ నేతలు అన్నారని... హోదా కోసం పోరాడినవారిపై టమోటాలు, రాళ్లు విసిరారని చెప్పారు. తాను ఎప్పటికీ వైయస్ కుటుంబ సభ్యుడినేనని చెప్పారు. తనను జైలుకు పంపించేందుకు టీడీపీ కుట్రలు చేస్తోందని అన్నారు. ఏపీ మంత్రిగా ఉన్న లోకేష్ కు హైదరాబాదులో ఏం పని? అని ప్రశ్నించారు. లోపాయికారీ ఒప్పందాలు చేసుకోవడం వైసీపీకి అలవాటు లేదని అన్నారు. టీడీపీ ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిపై సీబీఐ చేత విచారణ జరపాలని డిమాండ్ చేశారు. 
Chandrababu
Vijay Sai Reddy
delhi
YSRCP

More Telugu News