ipl: ఢిల్లీ డేర్ డెవిల్స్ శిబిరంలో చేరిన షమీ

  • వివాహేతర సంబంధాలు, మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు చేసిన షమీ భార్య
  • యాక్సిడెంట్ తో ఆసుపత్రిలో చేరి, కోలుకున్న వైనం 
  • ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టుతో చేరి, ప్రాక్టీస్ చేసిన షమీ
ఓపక్క భార్య ఆరోపణలు, మరోపక్క రోడ్డు యాక్సిడెంట్ తో ఇబ్బంది పడిన టీమిండియా పేసర్‌ మహమ్మద్‌ షమి ఆఖరికి ఐపీఎల్ లో ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌ శిబిరంలో చేరాడు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన శిక్షణా శిబిరంలో డేర్ డెవిల్స్ ఆటగాళ్లు ప్రాక్టీస్ చేస్తున్నారు. స్వదేశీ, విదేశీ ఆటగాళ్లంతా రెండు జట్లుగా విడిపోయి, సన్నాహక మ్యాచ్ లు ఆడుతున్నారు.

మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలపై విచారణ చేసిన బీసీసీఐ అవినీతి నిరోధక విభాగాధికారులు క్లీన్ చిట్ ఇవ్వడంతో ఐపీఎల్ లో షమీ ఆడేందుకు మార్గం క్లియరైన సంగతి తెలిసిందే. యాక్సిడెంట్ నుంచి కోలుకున్న షమీ, ప్రాక్టీస్ లో పాల్గొన్నాడు. షమీ చేరికతో ఆ జట్టు బౌలింగ్ విభాగం బలంగా తయారైంది.
ipl
delhi dear devils
mohammad shami

More Telugu News