Chandrababu: పార్లమెంటులో ప్రముఖులతో చంద్రబాబు మీటింగ్.. కాంగ్రెస్ నేతలతో కూడా భేటీ!

  • పార్లమెంటులో పలువురితో చంద్రబాబు భేటీ
  • అవిశ్వాసానికి మద్దతు తెలిపినందుకు అభినందనలు తెలయజేసిన సీఎం
  • బాబు కలిసిన వారిలో ఫరూక్ అబ్దుల్లా, వీరప్ప మొయిలీ, సింధియా, జితేందర్ రెడ్డి తదితరులు
విభజన హామీలను సాధించుకునే క్రమంలో వివిధ పార్టీల మద్దతును కూడగట్టేందుకు ఢిల్లీకి వెళ్లిన చంద్రబాబు పార్లమెంటులో బిజీబిజీగా గడుపుతున్నారు. పార్టమెంట్ సెంట్రల్ హాల్ లో ఆయన పలువురు నేతలతో చర్చలు జరుపుతున్నారు. ఆయన కలిసిన వారిలో జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమత్రి ఫరూక్ అబ్దుల్లా, సుప్రియా సూలే, జ్యోతిరాదిత్య సింధియా, టీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ జితేందర్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేత వీరప్ప మొయిలీ, రాజీవ్ సాతీవ్, టీఎంసీ ఎంపీ సౌగత్ రాయ్, అన్నాడీఎంకే నేత వేణుగోపాల్ తదితరులు ఉన్నారు. 
Chandrababu
parliament
farooq abdullah
veerappa moili
TRS

More Telugu News