Chhattisgarh: 12 సార్లు పెళ్లి చూపులుకు వెళ్లినా పెళ్లి కాలేదన్న బాధతో.. పక్కింటి యువతిని హత్య చేసిన యువకుడు

  • పింటును తిరస్కరించిన 12 మంది అమ్మాయిలు
  • పక్కింటి యువతి చేతబడి చేయిస్తోందని అనుమానం పెంచుకున్న పింటు
  • ఎవరూ లేని సమయంలో గొంతు నులిమి హత్య 
12 సార్లు పెళ్లి చూపులైనా తనకు వివాహం జరగడం లేదని పక్కింటి యువతిని హతమార్చిన చిత్రమైన ఘటన ఛత్తీస్ గఢ్ లో చోటుచేసుకుంది. దాని వివరాల్లోకి వెళ్తే.. ఛత్తీస్ గఢ్ రాజధాని రాయ్‌ పూర్‌ కి చెందిన పింటు బీఏ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. వివాహం చేసుకోవాలని భావించిన ఇతను 12 సార్లు పెళ్లి చూపులకు వెళ్లాడు. వారంతా అతనిని రిజెక్ట్ చేశారు.

దీంతో డిప్రెషన్ కు గురైన పింటు, ఆ సంబంధాలు చెడిపోవడానికి కారణం తన పక్కింట్లో ఉంటున్న అమెరికా పటేల్‌ అనే యువతి అని భావించాడు. తనకు పెళ్లి కానివ్వకుండా చేతబడి చేయిస్తోందని అనుమానం పెంచుకున్నాడు. దీంతో ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి చున్నీతో గొంతు నులిమి ఆమెను హతమార్చాడు. అనంతరం పారిపోయే ప్రయత్నం చేస్తున్న పింటును చుట్టుపక్కల వారు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు. 
Chhattisgarh
raipur
murder

More Telugu News