Telangana police women: తెలంగాణలో మహిళా కానిస్టేబుళ్ల యూనిఫాం మారబోతోంది...!

  • నిరసనకారులను ఎదుర్కోవడంలో మహిళా కానిస్టేబుళ్లకు ప్రస్తుత డ్రెస్‌తో ఇబ్బందులు
  • రెండు రకాల కొత్త యూనిఫాంల రూపకల్పన
  • తుది నిర్ణయం తీసుకోలేదన్న రాష్ట్ర డీజీపీ

తెలంగాణ రాష్ట్రంలో మహిళా కానిస్టేబుళ్ల యూనిఫారం త్వరలో మారబోతోంది. బహిరంగ ప్రదేశాల్లో నిరసనకారులను అదుపుచేసే విషయంలో మహిళా కానిస్టేబుళ్లు ఖాకీ సల్వార్-కమీజ్, చీరలతో తరచూ ఇబ్బందిపడుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర పోలీసు శాఖ వారి కోసం రెండు రకాల డ్రెస్ కోడ్‌లను ఎంపిక చేసింది. నడుము వరకు ఉండే కోటుతో ప్యాంటు-చొక్కా, అలాగే నడుము వరకు ఉండే కోటుతో సల్వార్ కమీజ్ లాంటి రెండు డిజైన్లను రూపకల్పన చేసింది.

ఈ డిజైన్లను ఆకాంక్ష మహేశ్వరి రూపొందించారు. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ పూర్వ విద్యార్థి అయిన ఆమె నగరంలోని ఐ-బ్రాండ్ సంస్థలో క్రియేటివ్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్నారు. ప్రస్తుత డ్రెస్ కోడుతో మహిళా కానిస్టేబుళ్లు తమ విధుల్లో కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు తాము గుర్తించామని రాష్ట్ర డీజీపీ ఎం.మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. అందువల్లే వారి కోసం కొత్త డ్రెస్ కోడును ఏర్పాటు చేసే యోచనలో ఉన్నామని, కానీ, దీనిపై తుది నిర్ణయం తీసుకోలేదని ఆయన చెప్పారు.

More Telugu News