nelson mandela: విన్నీ మండేలా కన్నుమూత!

  • నెల్సన్ మండేలా మాజీ భార్య విన్నీ (81) మృతి
  • చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న విన్నీ
  • ఓ ప్రకటన విడుదల చేసిన ఆమె కుటుంబసభ్యులు
దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా మాజీ భార్య, మదర్ ఆఫ్ ద నేషన్ విన్నీ మండేలా (81) మృతి చెందారు. ఈ విషయాన్ని ఓ ప్రకటన ద్వారా ఆమె కుటుంబసభ్యులు తెలిపారు. చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె జోహెన్నెస్ బెర్గ్ లోని ఓ ఆసుపత్రిలో మృతి చెందినట్టు ప్రకటించారు. ఆమె అంత్యక్రియలకు సంబంధించిన సమాచారం తెలియాల్సి ఉంది.

కాగా, దక్షిణాఫ్రికాలో జాతి వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన ఆమెను మదర్ ఆఫ్ ద నేషన్ గా పిలుస్తారు. నాడు నెల్సన్ మండేలాపై ఇరవై ఏడేళ్ల పాటు నిర్బంధం విధించడాన్ని నిరసిస్తూ పలు ఉద్యమాల్లో ఆమె పాల్గొన్నారు. విన్నీపై అవినీతి ఆరోపణల కారణంగా 1995లో కేబినెట్ నుంచి ఆమెను నెల్సన్ మండేలా తొలగించారు.1996లో మండేలా నుంచి ఆమె విడిపోయారు. నెల్సన్ మండేలా-విన్నీలకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.  
nelson mandela
vinni mandela

More Telugu News