nakka ananada babu: సుప్రీంకోర్టులో ఇంప్లీడ్ పిటీషన్ వేస్తాం: ఏపీ మంత్రి నక్కా ఆనందబాబు

  • అట్రాసిటీ యాక్టుపై సుప్రీంకోర్టు తీర్పుపై అభ్యంతరం
  • ఎస్సీ, ఎస్టీ వర్గాల ఉనికికి ప్రమాదం
  • ఆ యాక్టు వల్ల ఎస్సీ, ఎస్టీల మాన, ప్రాణ, ఆస్తికి ఎంతో రక్షణ
  • కేంద్ర న్యాయశాఖ మంత్రి కూడా పిటీషన్ వేస్తారు

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్టుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై త్వరలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇంప్లీడ్ పిటీషన్ వేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనందబాబు తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పు వల్ల ఎస్సీ, ఎస్టీ వర్గాల ఉనికికి ప్రమాదం వాటిల్లే అవకాశమున్న రీత్యా సీఎం నారా చంద్రబాబు నాయుడు ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు.

సచివాలయంలోని నాలుగో బ్లాక్ పబ్లిసిటీ సెల్ లో ఈ రోజు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజ్యాంగ పితామహుడు బీఆర్ అంబేద్కర్ ఉన్నత ఆశయంతో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్టును రూపొందించారన్నారు. ఈ యాక్టు వల్ల ఎస్సీ, ఎస్టీల మాన, ప్రాణ, ఆస్తికి ఎంతో రక్షణ లభిస్తోందన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టంలోని కొన్ని నిబంధనలను సడలిస్తూ సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పు వల్ల దళితులు, గిరిజనుల్లో అభద్రతా భావం నెలకొందన్నారు.

సుప్రీంకోర్టు తీర్పుపై ఇంప్లీడ్ పిటీషన్ వేయాలని చంద్రబాబు నాయుడు నిర్ణయించారని నక్కా ఆనందబాబు అన్నారు. ఇప్పటికే కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర ప్రసాద్ సుప్రీంకోర్టు తీర్పుపై కేంద్ర ప్రభుత్వం తరఫున కూడా రివ్యూ పిటిషన్ దాఖలు చేయనున్నట్లు తెలిపారన్నారు.

  • Loading...

More Telugu News