amul: ‘అమూల్’ సంస్థలో భారీ కుంభకోణం.. ఎండీ రాజీనామా!
- ‘అమూల్’లో రూ.450 కోట్ల కుంభకోణం
- ఆరోపణల నేపథ్యంలో పదవికి రాజీనామా చేసిన కె.రత్నం
- కొత్త ఎండీగా మెహతా నియామకం
గుజరాత్ లోని ప్రముఖ పాల ఉత్పత్తుల సంస్థ అమూల్ ఎండీ కె.రత్నం తన పదవికి రాజీనామా చేశారు. ‘అమూల్’లో రూ.450 కోట్ల కుంభకోణం జరిగినట్టు ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఆయన తన పదవికి రాజీనామా చేశారు. ఇటీవల జరిగిన బోర్డు సమావేశంలో రత్నం రాజీనామాకు చైర్మన్ రామ్ సిన్ పర్మార్ ఆమోదం తెలిపారు.
అమూల్ సంస్థ జనరల్ మేనేజర్ మెహతాను కొత్త ఎండీగా నియమిస్తున్నట్టు సంస్థ ప్రకటించింది. కాగా, అవినీతి, అవకతవకలకు తానే కారణమంటూ వెల్లువెత్తిన ఆరోపణలను ఆయన ఖండించారు. కేవలం కుటుంబ కారణాల రీత్యా తన పదవికి రాజీనామా చేశానని చెప్పారు.