sukumar: రంగమ్మత్త సూపర్.. చరణ్ ను మోసం చేశా: సుకుమార్

  • అనసూయ గురించి ఎంత చెప్పినా తక్కువే
  • పెద్ద స్టార్ చెవిటి మెషీన్ పెట్టుకుంటే బాగుంటుందా అని డౌట్ పడ్డా
  • సినిమా విజయానికి రామ్ చరణే కారణం
'రంగస్థలం'లో రంగమ్మత్తగా నటించిన అనసూయ గురించి ఎంత చెప్పినా తక్కువేనని ఆ చిత్ర దర్శకుడు సుకుమార్ చెప్పాడు. అనసూయతో ఆ పాత్రకే అందం వచ్చిందని అన్నాడు. తమిళ, తెలుగు పరిశ్రమలోని ఒక పదిమందిని తీసుకొచ్చి వారికి ఆడిషన్స్ కూడా నిర్వహించామని... అయినా ఆ క్యారెక్టర్ కు ఎవరూ సూట్ కాలేదని చెప్పాడు. రంగమ్మత్త క్యారెక్టర్ ప్రత్యేకంగా ఉండాలని అనుకున్నానని... అనసూయ చాలా గొప్పగా నటించిందని కితాబిచ్చాడు. 'రంగస్థలం' థ్యాంక్స్ మీట్ లో మాట్లాడుతూ, సుకుమార్ ఈ మేరకు స్పందించాడు.

చిట్టిబాబు పాత్రలో చరణ్ ను తప్ప మరొకరిని ఊహించుకోలేనని సుకుమార్ అన్నాడు. పెద్ద స్టార్ కుమారుడై ఉండి కూడా చెవిటి మెషీన్ పెట్టుకున్నాడని ప్రశంసించాడు. ఒక స్టార్ హీరో చెవిటి మెషీన్ పెట్టుకుంటే బాగుంటుందా అనే డౌట్ తనలో ఉండేదని... నమ్మకం లేకుండానే చరణ్ కు చెవిటి మెషీన్ ఇచ్చానని తెలిపాడు. చరణ్ తనను నమ్మాడని... మెషీన్ పెట్టుకోవడం వల్లే ఆ పాత్రను కొనసాగించగలిగానని చెప్పాడు. ఈ రకంగా చరణ్ ను మోసం చేశానని తెలిపాడు. 'రంగస్థలం' సినిమా ఇంత విజయం సాధించడానికి రామ్ చరణే కారణమని చెప్పాడు.
sukumar
Ramcharan
anasuya
rangasthalam
rangammatha

More Telugu News