Chandrababu: జగన్ రమ్మనడం వేరు.. చంద్రబాబు పిలుపునివ్వడం వేరు!: విష్ణుకుమార్ రాజు

  • విద్యార్థులను రోడ్లెక్కమనడం దారుణం
  • విభజన నాటి పరిస్థితులను సృష్టించాలని సీఎం భావిస్తున్నారు
  • అసెంబ్లీలో ప్రతిపక్షం ఉంటే ప్రసంగాల గోల తప్పుది

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు విమర్శలు కురిపించారు. ప్రత్యేక హోదా కోసం విద్యార్థులను రోడ్లెక్కమని చెప్పడం చాలా దారుణమని అన్నారు. విద్యార్థులంతా రోడ్లపైకి రావాలని ఒక ముఖ్యమంత్రి ఎలా చెబుతారని ప్రశ్నించారు.

ప్రతిపక్షనేతగా విద్యార్థులను జగన్ రమ్మనడం వేరు, సాక్షాత్తు ముఖ్యమంత్రి పిలుపునివ్వడం వేరని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన నాటి పరిస్థితులను సృష్టించాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారని విమర్శించారు. శాసనసభలో ప్రతిపక్షం ఉంటే ఈ ప్రసంగాల గోల తప్పేదేమోనని అన్నారు.

  • Loading...

More Telugu News