samantha: ‘థ్యాంక్యూ మీట్’ కు రాలేకపోతున్నా క్షమించండి : నటి సమంత

  • ‘రంగస్థలం’ చిత్ర యూనిట్ తో కలిసి పనిచేయడం గర్వకారణం
  • ఆదరించిన ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు
  •  ఓ ట్వీట్ చేసిన సమంత 

ఈ నెల 30న విడుదలైన ‘రంగస్థలం’ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. మంచి టాక్ సంపాదించుకున్న ‘రంగస్థలం’ థ్యాంక్యూ మీట్ ఈరోజు నిర్వహించింది. ఈ కార్యక్రమానికి తాను రాలేకపోతున్నానని నటి సమంత పేర్కొంది. ఈ సందర్భంగా ఓ ట్వీట్ చేసింది. అద్భుతమైన ఈ చిత్ర బృందంతో కలిసి పనిచేసినందుకు తాను చాలా గర్వపడుతున్నానని చెప్పింది. 

ఈ చిత్రాన్ని ఆదరించిన ప్రేక్షకులందరికీ ధన్యవాదాలని, వారు చూపిస్తున్న ప్రేమకు పొంగిపోతున్నానని తెలిపింది. చిత్ర యూనిట్ ఈరోజు నిర్వహిస్తున్న థ్యాంక్యూ మీట్ కు హాజరుకాలేకపోతున్నందుకు క్షమించాలని, ఎంతో సంతోషంగా ఉన్న మిమ్మల్ని కలవలేకపోతున్నానని, ఈ సినిమాలో నటించే అవకాశం తనకు రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొంది. కాగా, విహారయాత్ర నిమిత్తం నాగచైతన్య-సమంతా జంట ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News