bharat bandh: ఉత్తరప్రదేశ్ లో హింసాత్మకంగా మారిన భారత్ బంద్

  • సుప్రీంకోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా భారత్ బంద్
  • పలు చోట్ల హింసాత్మక ఘటనలు
  • శాంతియుతంగా నిరసన చేపట్టాలన్న యోగి

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంపై సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకు వ్యతిరేకంగా దళితవర్గాలు చేపట్టిన భారత్ బంద్ కార్యక్రమం... పలు చోట్ల హింసాత్మకంగా మారింది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ లో పలు హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. మీరట్ జిల్లా శోభాపూర్ పోలీసు ఔట్ పోస్టుకు ఆందోళనకారులు నిప్పు పెట్టారు. వాహనాలను ధ్వంసం చేశారు. పదుల సంఖ్యలో బస్సులను అగ్నికి ఆహుతి చేశారు. ఆగ్రాలో పోలీసులు, మీడియా సిబ్బందిపై రాళ్లదాడికి దిగారు. దీంతో, నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. ఓ పెట్రోల్ బంక్ కు నిప్పు పెట్టేందుకు యత్నించారు.

మరోవైపు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ మాట్లాడుతూ, శాంతియుత మార్గంలో నిరసన చేపట్టాలని ఆందోళనకారులను కోరారు. ఎస్సీ, ఎస్టీలను వేధించినట్టు ఆరోపణలను ఎదుర్కొనేవారిని తక్షణమే అరెస్ట్ చేయవద్దని సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. దీనికి నిరసనగానే దళితవర్గాలు భారత్ బంద్ కు పిలుపునిచ్చాయి.

More Telugu News