murali mohan: అదే సినిమా.. అదే ప్రొడ్యూసర్‌, డైరెక్టర్, ఆర్టిస్టులు: ముర‌ళీ మోహ‌న్ ఎద్దేవా

  • 15 రోజులుగా పార్లమెంటులో జరిగిందే జరుగుతోంది
  • అవిశ్వాసంపై చర్చ జరిపే ఉద్దేశం వారికి లేదు
  • ఆందోళన చేస్తోన్న ఎంపీలను సస్పెండ్ చేయొచ్చు
  • అది చేయడం లేదు

పార్ల‌మెంటులో అవిశ్వాస తీర్మానంపై చ‌ర్చ జ‌ర‌ప‌కుండా ప‌దే ప‌దే వాయిదా వేస్తోన్న తీరుపై టీడీపీ ఎంపీ ముర‌ళీ మోహ‌న్ అసంతృప్తి వ్య‌క్తం చేశారు. ఈ రోజు లోక్‌సభ వాయిదా పడిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... '15 రోజులుగా పార్లమెంటులో జరిగిందే జరుగుతోంది. అదే సినిమా.. అదే ప్రొడ్యూసర్‌, డైరెక్టర్, ఆర్టిస్టులు, స్క్రిప్టు సీన్లు రిపీట్ రిపీట్' అంటూ ఎద్దేవా చేశారు.

నిజంగా వారికి అవిశ్వాస తీర్మానంపై చర్చ జరిపే ఉద్దేశమే ఉంటే వెల్‌లోకి దూసుకొస్తోన్న ఎంపీలను గంట సేపు సస్పెండ్ చేసి చర్చ జరిపించవచ్చని కానీ, అది మాత్రం చేయడం లేదని, ఇటువంటి చర్యలు సరైనవి కావని మురళీ మోహన్ అన్నారు. వైసీపీ ఎంపీలు అసెంబ్లీ సమావేశాలు ముగిసే రోజున రాజీనామాలు చేస్తామని అంటున్నారని, అలా చేస్తే ఉప ఎన్నికలు రావనే అలా చేయాలనుకుంటున్నారని ఆరోపించారు. వైసీపీకి ఏపీలో ఇకపై డిపాజిట్లు కూడా రావని జోస్యం చెప్పారు.  

  • Loading...

More Telugu News