fools day: మోదీ సర్కార్ 200 కోట్ల ఉద్యోగాలు కల్పించింది..!: కాంగ్రెస్ వ్యంగ్య వీడియో విడుదల

  • ఫూల్స్ డేను వినూత్నంగా వాడుకున్న కాంగ్రెస్ పార్టీ
  • మోదీ వైఫల్యాలపై బ్రేకింగ్ న్యూస్ పేరుతో వీడియో
  • మోదీ హామీల్లోని వివిధ అంశాలను పేర్కొంటూ ఎద్దేవా

'ఫూల్స్‌ డే'ను కాంగ్రెస్‌ పార్టీ వినూత్నంగా వాడుకుంది. మోదీ సర్కార్ వైఫల్యాలపై బ్రేకింగ్ న్యూస్ అంటూ ఒక వీడియోను రూపొందించి, సోషల్ మీడియాలో విడుదల చేసింది. ఈ వీడియోలో ప్రధాని మోదీ తీసుకున్న డీమానిటైజేషన్ వల్ల అవినీతి అంతమైపోయిందని కాంగ్రెస్ ఎద్దేవా చేసింది. స్వచ్ఛభారత్ కు పీఎన్బీ నిందితులు పెద్దఎత్తున మద్దతిస్తున్నారని తెలిపింది.

చెత్తాచెదారంతో నిండిన గంగా నదిలో మోదీ చిత్రపటం కూడా స్వచ్ఛంగా కనిపిస్తోందని ఎద్దేవా చేసింది. మోదీ సర్కార్ 200 కోట్ల ఉద్యోగాలు కల్పించిందని, ఇప్పుడు అంగారక గ్రహం నుంచి గ్రహాంతరవాసులు వచ్చి భారత్‌ లో ఉద్యోగాలు చేస్తున్నారని వ్యంగ్యంగా పేర్కొంది. దేశంలోని స్మార్ట్‌ సిటీల్లో చెత్తను రోబోలు సేకరిస్తున్నాయంటూ కాంగ్రెస్ పార్టీ ఈ వీడియోలో ఎద్దేవా చేసింది.    

More Telugu News