indian railway: రైల్వే గురించి ఇకపై ఏం కావాలన్నా చిటికెలో తెలుసుకోవచ్చు!... 200 యాప్స్ ను తీసుకురానున్న రైల్వే శాఖ!

  • రైల్వే ప్రాజెక్టులు, వాటి ప్రగతిపై సమాచారం
  • ఐఆర్ సీటీసీ అందించే అన్ని ఆహార పదార్థాల వివరాలు
  • రైల్వే లెవల్ క్రాసింగ్, ఉద్యోగుల వేతన వివరాల కోసం యాప్ లు

భారతీయ రైల్వేలో మరింత పారదర్శకతకు వీలు కల్పిస్తూ త్వరలో 200 యాప్స్ ను తీసుకొచ్చే ప్రయత్నాలు మొదలయ్యాయి. ప్రయాణికులు, భాగస్వాములు, ఉద్యోగుల కోసం ఉద్దేశించినవి ఈ యాప్స్. మరీ ముఖ్యంగా త్వరలోనే మూడు యాప్స్ రానున్నాయి. వీటి ద్వారా ఎవరైనా సరే రైలు ప్రాజెక్టులు ఎక్కడ ఏవేమి జరుగుతున్నాయి, వాటిలో ప్రగతి తదితర వివరాలను తెలుసుకోవచ్చు.

అలాగే, ప్రయాణాలకు సంబంధించిన సమస్త సమాచారం కోసం యాప్ రానుంది. స్టేషన్ల అభివృద్ధి, కేటరింగ్ దుకాణాలు ఎక్కడ ఉన్నాయి, కాపలాలేని రైల్వే లెవల్ క్రాసింగ్ ల సమాచారం తెలుసుకునేందుకు కూడా వీలవుతుంది. ఐఆర్ సీటీసీ మెనూ గురించి చెప్పే మెను ఆన్ రైల్స్ యాప్ కూడా రానుంది. ఇందులో ఐఆర్ సీటీసీ సరఫరా చేసే అన్ని రకాల ఆహార పదార్థాలు, వాటి ధరలు ఉంటాయి. రైల్వే టూరిజం సేవల సమాచారం తెలుసుకునేందుకు యాప్ రానుంది. అలాగే ఉద్యోగులు తమ వేతనాలు, ఇతర భత్యాలను తెలిపేందుకు యాప్ అభివృద్ధి జరుగుతోంది.

  • Loading...

More Telugu News