gas cylinder: వంటింటికి చల్లని కబురు... పెట్రోల్ ధరలు మండుతుంటే గ్యాస్ ధరలు తగ్గాయ్!

  • సబ్సిడీ లేని వంట గ్యాస్ సిలిండర్ పై రూ.35.50 తగ్గింపు
  • ఐదు కిలోల గ్యాస్ సిలిండర్ పై  రూ.15 తగ్గింపు
  • వాణిజ్య గ్యాస్ సిలిండర్ పై రూ.54 తగ్గింపు

ఒకవైపు పెట్రోల్, డీజిల్ ధరలు భగ్గుమంటుంటే మరోవైపు వంట గ్యాస్ ధరలు దిగి రావడం వినియోగారులకు ఊరటనిచ్చేదే. పెట్రోల్, డీజిల్ ధరలు నాలుగేళ్ల గరిష్ట స్థాయికి చేరిన విషయం తెలిసిందే. అయితే, చమురు కంపెనీలు వంటగ్యాస్ ధరలను తగ్గించి వినియోగదారులకు భారాన్ని తగ్గించాయి. సబ్సిడీలేని వంటగ్యాస్ ధరను ఒక్కో సిలిండర్ కు రూ.35.50 మేర తగ్గిస్తూ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి.

అయితే, సబ్సిడీ వంటగ్యాస్ సిలిండర్ల ధరలో మాత్రం ఎటువంటి మార్పు లేదు. ఈ నిర్ణయం కేవలం కొద్ది మందికే ప్రయోజనం కల్పిస్తుంది. ఎందుకంటే దాదాపు మూడొంతుల మంది ఏడాదికి 12 సబ్సిడీ సిలిండర్ల కోటా (14.2 కిలోల గ్యాస్) పరిధిలోపు వినియోగం ఉన్నవారే. అంతకుమించి వినియోగించే వారికే కంపెనీల తాజా తగ్గింపు ప్రయోజనం ఒనగూరుతుంది. ఇక 19 కిలోల వాణిజ్య గ్యాస్ సిలిండర్ పైనా కంపెనీలు రూ.54 మేర తగ్గించాయి. ఐదు కిలోల గ్యాస్ సిలిండర్ పై తగ్గింపు రూ.15గా ఉంది.

More Telugu News