sumanth: హీరో సుమంత్ కొత్త సినిమా పేరు ‘ఇదం జగత్’

  • ‘ఇదం జగత్’ అంటే ‘ఇది ప్రపంచం’ అని సంస్కృతంలో అర్థం
  • ఈ వేసవి తర్వాత నా చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది
  • ఓ ట్వీట్ లో పేర్కొన్న హీరో సుమంత్

అనిల్ శ్రీ కంఠం దర్శకత్వంలో సుమంత్ హీరోగా రూపొందనున్న సినిమా పేరును ‘ఇదంజగత్’ గా  చిత్రయూనిట్ ఖరారు చేసింది. ఈ విషయాన్ని హీరో సుమంత్ ఓ ట్వీట్ లో తెలిపారు. తన 24వ చిత్రానికి ‘ఇదం జగత్’ గా టైటిల్ ఖరారు చేశామని, ఈ వేసవి తర్వాత తన చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుందని తెలిపాడు. ‘ఇదం జగత్’ అంటే ‘ఇది ప్రపంచం’ అని సంస్కృతంలో అర్థమని చెప్పాడు. ఈ పోస్ట్ తో పాటు ‘ఇదం జగత్’ పోస్టర్ ను జతపరిచాడు.

కాగా, విరాట్ ఫిల్మ్స్ అండ్ శ్రీ విఫ్నేుష్ కార్తీక్ సినిమాస్ పతాకాలపై జొన్నలగడ్డ పద్మావతి, గంగపట్నం శ్రీధర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో  సుమంత్  వైవిధ్యమైన పాత్రలో కనబడనున్నాడని, కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకు ఈ చిత్రం తప్పకుండా నచ్చుతుందని ఈ చిత్ర నిర్మాతలు తెలిపారు. ఎనభై శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ను త్వరలో విడుదల చేయనున్నట్టు చెప్పారు.

  • Loading...

More Telugu News