anchor anasuya: ఈ పాత్రలో నన్ను తప్ప ఎవరినీ ఊహించుకోలేమంటున్నారు : ‘రంగమ్మత్త’ అనసూయ

  • శివగామి పాత్రకు రమ్యకృష్ణ.. రంగమ్మత్త పాత్రకు నేనంటూ అభిమానులు ప్రశంసిస్తున్నారు
  • రంగమ్మత్తలో ఉన్న ఒదుగుతనం నాలో ఉంది
  • అందుకే, ఆ పాత్రలో అంతగా ఒదిగిపోయాను

‘రంగస్థలం’ సినిమాలో అనసూయ పోషించిన రంగమ్మత్త పాత్రకు అభిమానుల ఆదరణ లభించింది. రంగమ్మత్త పాత్రలో ఆమె ఎంతగానో ఒదిగిపోయిందని ప్రేక్షకుల ప్రశంసలతో అనసూయ ఆనందపడిపోతోంది. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, బాహుబలి సినిమాలో శివగామి పాత్రలో రమ్యకృష్ణను తప్ప మరెవ్వరినీ ఎలా అయితే ఊహించుకోలేమో, రంగస్థలం చిత్రంలో రంగమ్మత్తపాత్రలో తనను తప్ప మరెవ్వరినీ ఊహించుకోలేమని చాలా మంది అభిమానులు అంటున్నారని, ఈ ప్రశంసలు తనకు చాలని చెప్పింది.

రంగమ్మత్తలో ఉన్న ఒదుగుతనం తనలో ఉందని, అందుకే, ఆ పాత్రలో అంతగా తాను ఒదిగిపోయానని తెలిపింది. ‘రంగస్థలం’ దర్శకుడు సుకుమార్ అద్భుతంగా తెరకెక్కించిన ఈ సినిమాను ఆదరించి, విజయం చేకూర్చిన ప్రేక్షకులను తన ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అనసూయ చెప్పింది.

More Telugu News