China: చైనా స్పేస్ స్టేషన్ 'తియాంగాంగ్-1' ఈ క్షణం ఎక్కడ ఉందో తెలుసుకోండిలా!

  • ఎక్కడుందో తెలుసుకునే ఏర్పాట్లు చేసిన శాస్త్రవేత్తలు
  • 27 వేల కిలోమీటర్ల వేగంతో పయనం
  • ఏ క్షణమైనా భూ వాతావరణంలోకి

శాస్త్రవేత్తల నియంత్రణ కోల్పోయి భూమివైపు దూసుకు వస్తున్న చైనా స్పేస్ స్టేషన్ తియాంగాంగ్-1 ఏ క్షణం ఎక్కడ ఉందన్న విషయాన్ని తెలిపేందుకు నాసాతో పాటు పలు దేశాల స్పేస్ ఏజన్సీలు ఏర్పాట్లు చేశాయి. ఎప్పటికప్పుడు తియాంగాంగ్-1 ప్రయాణం గురించిన లైవ్ సమాచారాన్ని అందిస్తున్నాయి.

స్పేస్‌ ల్యాబ్ ఏ క్షణం ఎక్కడ ఉందన్న విషయాన్ని ‘శాట్ వ్యూ’ అనే శాటిలైట్ల ట్రాకింగ్ వెబ్‌ సైట్ తెలియజేస్తోంది. 'http://www.satview.org/' వెబ్ సైట్ కు వెళ్లి స్పేస్ స్టేషన్ గమనాన్ని చూడవచ్చు. ప్రస్తుతం ఇది 27,596 కిలోమీటర్ల వేగంతో భూమి చుట్టూ తిరుగుతుండగా, ఏ క్షణమైనా భూ వాతావరణంలోకి రావచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రస్తుతం ఇది దక్షిణాఫ్రికా భూ ఉపరితలంపై ఉంది.

More Telugu News