Amith sha: కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఎలా తయారయ్యారంటే...: అమిత్ షా తీవ్ర ఆరోపణలు

  • కాంగ్రెస్ అవినీతికి సిద్ధరామయ్య ప్రభుత్వం ఏటీఎంలా మారింది
  • కర్ణాటకకు బీజేపీ ఒక్కటే ప్రత్యామ్నాయం
  • ఇక్కడ గెలిచి దక్షిణాదిలో బీజేపీని విస్తరిస్తాం
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా మరోమారు ఫైరయ్యారు. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో నిప్పులు చెరుగుతున్న షా ఈసారి జోరు పెంచారు. కర్ణాటక ప్రభుత్వాన్ని కాంగ్రెస్ తన అవినీతికి ఏటీఎంలా ఉపయోగించుకుంటోందని ఆరోపించారు. మైసూరులోని చామరాజనగర్, మాండ్యా జిల్లాల్లో పర్యటిస్తున్న ఆయన మాట్లాడుతూ కర్ణాటకలో బీజేపీ ఒక్కటే ప్రత్యామ్నాయమన్నారు.

కాంగ్రెస్ హయాంలో కర్ణాటక అవినీతికి డెన్‌లా మారిందని అమిత్ షా ఆరోపించారు. అవినీతి ప్రభుత్వాన్ని పెకలించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, కాంగ్రెస్ నుంచి తమకు పోటీ ఎదురవుతుందని తాను అనుకోవడం లేదని స్పష్టం చేశారు. ఇక్కడ గెలవడం ద్వారా దక్షిణాదిలో పార్టీని విస్తరిస్తామని షా పేర్కొన్నారు. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే సిద్ధరామయ్య ప్రభుత్వం లింగాయత్ మైనారిటీ ట్యాగును ఉపయోగించుకుంటోందని అమిత్ షా ఎద్దేవా చేశారు.
Amith sha
BJP
Karnataka
Congress

More Telugu News