Pilot: 1971లో హైజాక్‌కు గురైన ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమాన పైలట్ మృతి

  • దీర్ఘకాలికంగా అస్వస్థతతో బాధపడుతున్న కెప్టెన్ కచ్రు
  • శ్రీనగర్ నుంచి జమ్ము వెళ్తున్న విమానం హైజాక్
  • లాహోర్ విమానాశ్రయంలో దించిన హైజాకర్లు
  • వారి డిమాండ్‌ను తోసి పుచ్చిన భారత్

1971లో హైజాక్‌కు గురైన ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానానికి పైలట్‌గా వ్యవహరించిన కెప్టెన్ ఎంకే కచ్రు (93) శనివారం కన్నుమూశారు. దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో తుది శ్వాస విడిచారు. శ్రీనగర్ నుంచి 26 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బందితో జమ్ము వెళ్తున్న ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానాన్ని హైజాక్ చేసిన ఇద్దరు కశ్మీరీలు దానిని పాకిస్థాన్‌లోని లాహోర్‌కు మళ్లించారు.

భారత జైళ్లలో ఉన్న కొందరు ఖైదీలను విడుదల చేయాలన్న డిమాండ్‌తో విమానాన్ని హైజాక్ చేసిన వారిని అప్పటి పాక్ విదేశాంగ మంత్రి జుల్ఫికర్ అలీ భుట్టో ప్రశంసించడం విశేషం. అయితే హైజాకర్ల డిమాండ్‌ను భారత్ నిర్ద్వంద్వంగా తోచి పుచ్చింది. దీంతో విమానంలోని ప్రయాణికులను, సిబ్బందిని రోడ్డు మార్గం ద్వారా భారత్ కు పంపిన హైజాకర్లు విమానాన్ని తగలబెట్టారు. దీనికి ప్రతిగా భారత గగనతలంపై నుంచి పాక్ విమానాలు ఎగరకుండా నిషేధం విధించింది.

More Telugu News