Andhra Pradesh: నాది ఉడుంపట్టే... మిమ్మల్ని వదలను, మీ ఆటలు సాగనివ్వను: స్వరం పెంచిన చంద్రబాబు

  • హామీలు నెరవేర్చమంటే ఎదురుదాడి చేస్తున్నారు
  • కొన్ని పార్టీల అండతో కేంద్రం రాజకీయాలు
  • నాలుగు బడ్జెట్ ల తరువాత కూడా మాట్లాడకుంటే ఎలా?
  • లేపాక్షి ఉత్సవాల్లో సీఎం చంద్రబాబు

పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన విభజన హామీలను మరచిన కేంద్రాన్ని నిలదీస్తే, ఎదురుదాడి చేస్తున్నారని, రాష్ట్రంలోని కొన్ని పార్టీల అండ చూసుకుని కేంద్రం రాజకీయాలు చేస్తోందని, తాను ఏమాత్రం వెనక్కు తగ్గబోనని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు హెచ్చరించారు. లేపాక్షి ఉత్సవాల సందర్భంగా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన ఆయన, తనది ఉడుంపట్టని, ఓ పట్టాన వదిలేది లేదని స్పష్టం చేశారు.

తమిళనాడులో చేసినట్టుగా రాజకీయాలు ఇక్కడ చేద్దామని కేంద్రం భావిస్తోందని, అది కుదరదని బీజేపీకి అతి త్వరలోనే తెలిసొస్తుందని హెచ్చరించారు. కష్టాల్లో ఉన్న ఏపీ నిలదొక్కుకోవాలంటే, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీతో స్నేహంగా వుండాలని తాను భావించానని, అందుకే నాలుగేళ్ల పాటు మౌనంగా ఉన్నానని అన్నారు. నాలుగు బడ్జెట్ల తరువాత కూడా ఏపీకి న్యాయం చేయకుంటే, ఇంకా ఎదురు తిరగక ఏమి చేయాలని ప్రశ్నించారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకే కేంద్ర మంత్రులతో రాజీనామాలు చేయించామని, ఆ మరుసటి రోజే అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టామని గుర్తు చేశారు.

  • Loading...

More Telugu News