nukaraju: అదరగొట్టేస్తోన్న 'భలేమంచి చౌక బేరమ్' ట్రైలర్

  • మారుతి కాన్సెప్ట్ తో ' భలేమంచి చౌక బేరమ్' 
  • దర్శకుడిగా మురళీకృష్ణ
  • ఆసక్తిని రేపుతోన్న కంటెంట్  

'రోజులు మారాయి' సినిమాతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న మురళీకృష్ణ, మారుతి అందించిన కాన్సెప్ట్ తో 'భలేమంచి చౌక బేరమ్' సినిమాను రూపొందిస్తున్నాడు. నవీద్ .. నూకరాజు .. యామిని ప్రధానమైన పాత్రలను పోషిస్తోన్న ఈ సినిమా నుంచి, కొంతసేపటి క్రితం ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

 ఓ మాజీ ఆర్మీ ఆఫీసర్ తన 30 సంవత్సరాల అనుభవంతో దేశ రహస్యాలను ఫైల్ చేసి ఉంచుతాడు. పెద్ద మొత్తానికి ఆ రహస్యాలను శత్రుదేశస్తులకు అమ్మేయడానికి సిద్ధపడతాడు. అయితే అనుకోకుండా ఆ ఫైల్ ఇద్దరు స్నేహితులకు చిక్కుతుంది. క్యాబ్ డ్రైవర్ .. కొరియర్ బాయ్ గా పనిచేస్తోన్న ఆ స్నేహితులు కూడా ఆ రహస్యాలను అమ్మేయాలనే నిర్ణయించుకుంటారు. అప్పుడు ఏం జరుగుతుంది? అనే ఆసక్తి రేకెత్తేలా ఈ ట్రైలర్ ను కట్ చేశారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.  

More Telugu News