jeevita: 'రాజమౌళి మూవీలో విలన్ గా రాజశేఖర్' అనే ప్రచారంపై స్పందించిన జీవిత

  • రాజమౌళి దర్శకత్వంలో మల్టీస్టారర్ 
  • విలన్ గా రాజశేఖర్ అంటూ ప్రచారం 
  • అలాంటి ఆఫర్ రాలేదంటోన్న జీవిత

రాజమౌళి తదుపరి సినిమా కోసం ఆయన అభిమానులంతా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ .. చరణ్ ల కాంబినేషన్లో ఒక సినిమా రూపొందనుందనే వార్త బయటికి రావడంతో, అందరిలో మరింత ఆసక్తి పెరిగిపోయింది. ఈ క్రమంలో ఈ సినిమాలో విలన్ గా రాజశేఖర్ చేసే అవకాశాలు ఎక్కువగా వున్నాయనే టాక్ వచ్చింది. రాజమౌళి ఆయనను సంప్రదించడం .. ఆయన ఓకే అనడం కూడా జరిగిపోయాయని చెప్పుకున్నారు.

జోరుగా జరుగుతోన్న ఈ ప్రచారాన్ని గురించి తాజాగా జీవిత స్పందించారు. విలన్ గా చేయమంటూ రాజమౌళి నుంచి రాజశేఖర్ కి ఎలాంటి అఫర్ రాలేదని జీవిత చెప్పారు. శివాని సినిమా లాంచింగ్ కోసం రాజమౌళి రావడం వలన అలా అనుకుని ఉంటారని అన్నారు. ఈ ప్రచారంలో ఎంతమాత్రం నిజం లేదని స్పష్టం చేశారు. దాంతో ఈ సినిమాలో విలన్ గా ఎవరిని ఎంపిక చేయవచ్చనే విషయంపై ఫిల్మ్ నగర్లో జోరుగా చర్చలు నడుస్తున్నాయి.       

  • Loading...

More Telugu News