యాపిల్ ఫోన్ పై దావా వేసిన 60 వేల మంది కొరియన్లు!
- అప్ డేట్స్ చేసుకుంటే ఫోన్లు స్లో అవుతున్నాయి
- మరమ్మతుల కోసం వేలల్లో ఖర్చవుతోంది
- ఆ రుసుమును సంస్థ చెల్లించాలని డిమాండ్
మరమ్మతుల రుసుమును పరిహారంగా యాపిల్ సంస్థే తమకు చెల్లించాలని దావాలో కోరారు. సాఫ్ట్ వేర్ అప్ డేట్ చేయకపోతే ఫోన్లు షట్ డౌన్ అయిపోతాయని, అలా పూర్తిగా పోకుండా ఉండేందుకే తాము సరికొత్త కొత్త సాఫ్ట్ వేర్ అప్ డేట్స్ తీసుకొస్తున్నామని యాపిల్ సంస్థ తెలిపింది. ఇలా జరుగుతుందని ఫోన్ కొనుగోలు సమయంలో తమకు ఎందుకు చెప్పలేదని వారు యాపిల్ ను ప్రశ్నిస్తున్నారు. వినియోగదారులకు అనుకూలంగా న్యాయస్థానం తీర్పునిస్తే, యాపిల్ సంస్థ 11.9 మిలియన్ డాలర్ల పరిహారం చెల్లించాల్సి ఉంటుందని న్యాయనిపుణులు చెబుతున్నారు.