Ramcharan: 'రంగస్థలం' ఊరు నుంచి బయటకు రాలేకపోతున్నా: చిరంజీవి కుమార్తె సుస్మిత

  • ఇంత గొప్ప ట్రీట్ సుకుమార్ వల్లే సాధ్యం
  • చరణ్ ఎమోషనల్ పర్ఫామెన్స్ అదిరిపోయింది
  • తమ్ముడి పట్ల చాలా గర్వంగా ఉంది
రామ్ చరణ్, సమంత, సుకుమార్ ల కాంబినేషన్లో తెరకెక్కిన 'రంగస్థలం' చిత్రం నిన్న భారీ ఎత్తున విడుదలైంది. మంచి టాక్ ను సంపాదించుకుని, బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. ముఖ్యంగా రామ్ చరణ్ నటనకు విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు దక్కుతున్నాయి.

ఈ క్రమంలో చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత స్పందిస్తూ... రంగస్థలం ఊరు నుంచి, ఆ మనుషుల మధ్య నుంచి బయటకు రావాలనిపించడం లేదని చెప్పారు. ఇంత గొప్ప ట్రీట్ కేవలం సుకుమార్ వల్ల మాత్రమే సాధ్యమని తెలిపారు. సినిమాలో చరణ్ ఎమోషనల్ పర్ఫామెన్స్ అదిరిపోయిందని చెప్పారు. తన సోదరుడు చరణ్ పట్ల చాలా గర్వంగా ఉందని అన్నారు. 'సమంత, మైత్రి మూవీ మేకర్స్.. మీరు చాలా స్పెషల్' అంటూ ఆమె ట్వీట్ చేశారు. 
Ramcharan
sushmitha
rangathalam movie
sukumar
samntha

More Telugu News