neerav modi: నీరవ్ మోదీ, మేహుల్ చోక్సీలను భారత్ కు రప్పించి తీరతాం : నిర్మలా సీతారామన్

  • నీరవ్, మేహుల్ చోక్సీలిద్దరూ ఆర్థిక నేరానికి పాల్పడ్డారు
  • అవినీతిపరులను వదిలిపెట్టం
  • అవినీతిరహిత పాలన అందించేందుకు ముందుంటాం
పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్ బీ) కుంభకోణం కేసులో నిందితులు ప్రముఖ వ్యాపారవేత్తలు నీరవ్ మోదీ, మేహుల్ చోక్సీలను వదిలిపెట్టమని, ఎలాగైనా భారత్ కు రప్పించి తీరతామని కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు.

 నీరవ్, మేహుల్ చోక్సీలిద్దరూ ఆర్థిక నేరానికి పాల్పడ్డారని, అవినీతిపరులను వదిలిపెట్టమని నిర్మలా సీతారామన్ అన్నారు. అవినీతిరహిత పాలన అందించేందుకు ఎన్డీఏ ప్రభుత్వం ముందుంటుందని చెప్పారు. ఈ సందర్భంగా బీజేపీ ప్రభుత్వం పనితీరు అద్భుతంగా ఉందని ఆమె చెప్పుకున్నారు. ప్రభుత్వ పథకాలతో మెరుగైన సంస్కరణలకు పెద్ద పీట వేస్తోందని చెప్పారు. 
neerav modi
nirmala sitaraman

More Telugu News