Jayaprakash Narayan: పవన్ కల్యాణ్‌పై లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ విమర్శలు

  • జేఎఫ్‌సీపై పవన్ కల్యాణ్ మొదట శ్రద్ధ చూపారు
  • ఇప్పుడు పట్టించుకోవడం లేదు
  • జేఎఫ్‌సీ నివేదిక ఇచ్చిన తరువాత దానిపై ఎలాంటి చర్యలు లేవు
  • అందుకే నేను స్వతంత్ర నిపుణుల కమిటీ ఏర్పాటు చేశాను

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాను తొలుత తెరపైకి తెచ్చింది తానేనని, ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రానికి హోదా వచ్చే అవకాశమే లేదని, ఈ విషయం అన్ని రాజకీయ పార్టీలకు తెలుసని లోక్‌సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ అన్నారు. పేరు ఏదైనా కావచ్చు కానీ, రాష్ట్రానికి రావాల్సిన నిధులన్నీ రావాలని ఆకాంక్షించారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌కు చట్టపరంగానూ, పార్లమెంటులోనూ ఇచ్చిన హామీలను కేంద్ర ప్రభుత్వం ఏ మేరకు నెరవేర్చిందో తేల్చడం కోసం  జయప్రకాశ్ నారాయణ ఆధ్వర్యంలో స్వతంత్ర నిపుణుల బృందం ఏర్పాటై ఈ రోజు తొలి సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే.

ఈ సమావేశం ముగిసిన అనంతరం జేపీ మీడియాతో మాట్లాడుతూ... సంయుక్త నిజనిర్ధారణ కమిటీ (జేఎఫ్‌సీ) పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ మొదట శ్రద్ధ చూపించి తరువాత పట్టించుకోవడం లేదని అన్నారు. జేఎఫ్‌సీ నివేదిక ఇచ్చిన తరువాత దానిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని, అందుకే తాను స్వతంత్ర నిపుణుల కమిటీ ఏర్పాటు చేశానని తెలిపారు. జేఎఫ్‌సీ తొలిదశ అయితే, స్వతంత్ర నిపుణుల కమిటీ రెండో దశ అని వ్యాఖ్యానించారు. తాము చర్చించడానికి కేంద్ర ప్రభుత్వం సమయం ఇస్తే వెళ్లి కలుస్తామని తెలిపారు.

  • Loading...

More Telugu News