Sachin Tendulkar: సచిన్ టెండుల్కర్ ను మనసారా అభినందించిన జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా

  • మైదానం వెలుపల కూడా స్ఫూర్తినీయులు
  • ప్రశంసించిన ముఫ్తి
  • జమ్మూ కశ్మీర్ లో స్కూల్ భవనానికి రూ.40 లక్షలు ఇచ్చిన సచిన్
జమ్మూ కశ్మీర్ రాష్ట్ర ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తి, క్రికెట్ మాజీ దిగ్గజం సచిన్ టెండుల్కర్ ను మనసారా అభినందించారు. జమ్మూ కశ్మీర్ లోని కుప్వారా జిల్లాలో ఓ స్కూల్ భవన నిర్మాణానికి సచిన్ టెండుల్కర్ రూ.40 లక్షలు కేటాయించారు. తన ఎంపీ నిధుల కోటా నుంచి ఈ మేరకు నిధుల సాయం అందించేందుకు సంసిద్ధత ప్రకటించారు. సచిన్ రాజ్యసభ సభ్యుడన్న విషయం తెలిసిందే. దీంతో ట్విట్టర్ వేదికగా ముఫ్తి దీనిపై తన స్పందన తెలియజేశారు. ‘‘స్కూల్ భనవ నిర్మాణానికి ఎంపీలాడ్ ఫండ్స్ నుంచి నిధులు కేటాయించినందుకు సచిన్ కు ధన్యవాదములు. మైదానం వెలుపల కూడా మీరు మాకు స్ఫూర్తినిస్తూనే ఉన్నారు’’ అంటూ మెహబూబా ముఫ్తి ట్వీట్ చేశారు.
Sachin Tendulkar
mehabooba mufti

More Telugu News