Kerala: అయ్యప్ప జన్మదినం నాడు శబరిమలలో అపశ్రుతి!

  • నేడు అయ్యప్ప జన్మదిన వేడుకలు
  • నీలిమలైలో భారీ ఊరేగింపు
  • అదుపు తప్పిన ఏనుగు, పలువురికి గాయాలు
కేరళలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమలలో నేడు అయ్యప్ప జన్మదిన వేడుకలు జరుగుతున్న సమయంలో, అపశ్రుతి చోటు చేసుకుంది. నీలిమలైలో ఊరేగింపు జరుగుతుండగా, ఉత్సవాల్లో పాల్గొనేందుకు తెచ్చిన ఏనుగు అదుపుతప్పి పరుగులు తీసింది. దీంతో భక్తులంతా చెల్లాచెదరు కాగా, తొక్కిసలాట జరిగి పలువురు భక్తులు, పోలీసులకు గాయాలయ్యాయి.

గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఏనుగు పరుగులు పెడుతుండటంతో ఊరేగిస్తున్న అయ్యప్ప విగ్రహం కిందపడిపోయింది. దీన్ని అపచారంగా భావించిన ఆలయ పూజారులు పరిహార పూజలు చేశారు. ఆపై మావటీలు ఎంతో శ్రమించి ఏనుగును అదుపులోకి తేవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
Kerala
Sabarimala
Ayyappa
Elephant

More Telugu News