kangana: 'మణికర్ణిక' ఖర్చు 200 కోట్లు .. ఇప్పుడిదే హాట్ టాపిక్!

  • క్రిష్ దర్శకత్వంలో మణికర్ణిక
  • ప్రధాన పాత్రలో కంగనా రనౌత్ 
  • ఆమె లుక్ కి దక్కుతోన్న ప్రశంసలు

వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి జీవితచరిత్ర ఆధారంగా హిందీలో 'మణికర్ణిక' చిత్రం రూపొందుతోంది. క్రిష్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో, టైటిల్ రోల్ ను కంగనా రనౌత్ పోషిస్తోంది. ఆమె లుక్ కి భారీస్థాయిలో ప్రశంసలు దక్కుతుండటం విశేషం. చారిత్రక నేపథ్యంతో కూడిన సినిమా కావడం వలన, 60 నుంచి 70 కోట్ల వరకూ ఖర్చుచేస్తూ ఉండొచ్చని అంతా అనుకున్నారు.

కానీ ఈ సినిమా బడ్జెట్ 200 కోట్లు అని చెబుతూ అందరికీ షాక్ ఇచ్చింది కంగనా రనౌత్. ఒక టీవీ కార్యక్రమానికి హాజరైన ఆమె .. ఈ సినిమాను గురించి ప్రస్తావిస్తూ ఈ విషయం చెప్పింది. కథానాయిక ప్రాధాన్యత కలిగిన సినిమాలను 100 కోట్ల బడ్జెట్ లో చేయడానికే బాలీవుడ్ దర్శక నిర్మాతలు ఆలోచన చేస్తారు. అలాంటిది 'మణికర్ణిక'కి ఈ స్థాయిలో ఖర్చు చేస్తున్నట్టు కంగనా చెప్పడమే ఇప్పుడు అక్కడ హాట్ టాపిక్ గా మారింది.      

More Telugu News