navjot singh sidhu: మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్దూకు షాక్!

  • ఐటీ రిటర్న్స్ కు సరైన ఆధారాలు సమర్పించని సిద్దూ
  • గత జనవరిలోనే ఐటీ నోటీసులు
  • తాజాగా రెండు బ్యాంక్ అకౌంట్ల సీజ్
మాజీ క్రికెటర్, పంజాబ్ రాష్ట్ర మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్దూకు ఐటీ అధికారులు షాక్ ఇచ్చారు. ఐటీ రిటర్న్స్ కు సంబంధించి సరైన ఆధారాలు సమర్పించని కారణంగా... ఆయనకు చెందిన రెండు బ్యాంక్ అకౌంట్లను సీజ్ చేశారు. 2014-15 ఆర్థిక సంవత్సరంలో సిద్ధూ చేసిన ఖర్చుకు సంబంధించి సమర్పించిన పత్రాల్లో అవకతవకలు ఉన్నాయని వారు తెలిపారు. అదనంగా మరో రూ. 52 లక్షల పన్ను కట్టాల్సిందేనని ఆదేశించారు. గత జనవరిలోనే సిద్దూకు నోటీస్ ఇచ్చామని... ఈ నోటీసులపై సిద్దూ అప్పీల్ కు వెళ్లారని... అయితే, విచారణ చేపట్టిన కమిషనర్ చివరకు పన్ను కట్టాల్సిందేనంటూ తీర్పును వెలువరించడంతో... బ్యాంక్ ఖాతాలను సీజ్ చేశామని ఐటీ అధికారులు ప్రకటించారు.
navjot singh sidhu
bank accounts
seize
income tax

More Telugu News