Bangkok: బస్సును చుట్టుముట్టిన అగ్నికీలలు... 20 మంది సజీవదహనం!

  • బ్యాంకాక్ వైపు వస్తున్న బస్సు
  • బస్సులో 47 మంది ప్రయాణికులు
  • ఘటనలో పలువురికి గాయాలు
బ్యాంకాక్ లో ఘోరం జరిగింది. థాయ్ సరిహద్దు నుంచి రాజధాని వైపు వస్తున్న బస్సులో ప్రమాదవశాత్తూ మంటలు చెలరేగగా, 20 మంది సజీవదహనమయ్యారు. పలువురికి గాయాలు కాగా, ముగ్గురి పరిస్థితి తీవ్రంగా ఉంది. ఈ ఘటన శుక్రవారం అర్ధరాత్రి 1.25 గంటల సమయంలో టాక్ ప్రావిన్స్ సమీపంలో జరిగింది.

చుట్టూ చీకటిగా ఉండటం, మంటలు ఒక్కసారిగా చుట్టుముట్టడంతో బస్సులో నుంచి ఎక్కువ మంది బయట పడలేకపోయారని అధికారులు వ్యాఖ్యానించారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 37 మంది ఉన్నట్టు వెల్లడించారు. మృతులు మయన్మార్ కు చెందిన వలస కార్మికులని, విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను ఆర్పివేశారని తెలిపారు. డ్రైవర్ మద్యం తాగి బస్సును నడుపుతున్నట్టు గుర్తించామని, అతన్ని అదుపులోకి తీసుకున్నామని వెల్లడించారు.
Bangkok
Bus fire
Fire Accident

More Telugu News