Andhra Pradesh: ఏపీలో కొత్తగా పది మండలాలు.. గెజిట్ నోటిఫికేషన్ విడుదల

  • కొత్త మండలాల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం
  • ప్రజల నుంచి రాని అభ్యంతరాలు
  • విశాఖ, గుంటూరు, నెల్లూరు, కర్నూలు, విజయవాడ జిల్లాలలో ఏర్పాటు

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా మరో పది మండలాలు వచ్చి చేరాయి. రాష్ట్రంలోని విశాఖపట్టణం, నెల్లూరు, కర్నూలు, గుంటూరు జిల్లాల్లో ఉన్న పెద్ద నగర మండలాలను విభజించి కొత్త మండలాలను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనకు మంత్రి  వర్గం ఆమోదం తెలిపింది. దీంతో జనవరిలో అధికారులు జిల్లాల వారీగా నోటిఫికేషన్ జారీ చేసి అభ్యంతరాలు స్వీకరించారు. అయితే, మండలాల ఏర్పాటుపై అభ్యంతరాలు రాకపోవడంతో వాటి ఏర్పాటును ఖరారు చేశారు. రెవెన్యూ శాఖ గురువారం కొత్త మండలాలను గెజిట్ నోటిఫికేషన్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.

విశాఖపట్టణంలో సీతమ్మధార, మహారాణిపేట, గోపాలపురం, ములగాడ, గుంటూరు తూర్పు, గుంటూరు పశ్చిమ, నెల్లూరు జిల్లాలో అర్బన్, రూరల్, కర్నూలులో అర్బన్, రూరల్ మండలాలను కొత్తగా ఏర్పాటు చేశారు. విజయవాడలో రెండు మండలాలను ఏర్పాటు చేసినా అభ్యంతరాల పరిశీలన పూర్తికాకపోవడంతో వాటిని నోటిఫికేషన్‌లో చేర్చలేదు. పరిశీలన పూర్తయిన అనంతరం వాటిని కూడా గెజిట్ నోటిఫికేషన్‌లో చేర్చనున్నట్టు అధికారులు తెలిపారు.

More Telugu News