anna hazare: అన్నా హజారేకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేసిన మహారాష్ట్ర సీఎం

  • లోక్‌పాల్ చట్టం తీసుకురావాలని, రైతుల హక్కులు కాపాడాలని దీక్ష
  • అన్నా హజారేతో దేవేంద్ర ఫడ్నవీస్‌, గజేంద్రసింగ్‌ షెకావత్ చర్చలు
  • చర్చలు సఫలం కావడంతో దీక్ష విరమణ
అవినీతి నిర్మూలన కోసం సమర్థవంతమైన లోక్‌పాల్ చట్టం తీసుకురావాలని, అలాగే, రైతుల హక్కులు కాపాడాలని డిమాండ్‌ చేస్తూ సామాజిక కార్యకర్త అన్నా హజారే ఢిల్లీలోని చారిత్రాత్మక రామ్‌లీలా మైదానంలో గత శుక్రవారం ఉదయం నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభించిన విషయం తెలిసిందే.

ఈ రోజు ఆయన వద్దకు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌, కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్ వచ్చి చర్చలు జరపడంతో దీక్ష విరమణకు అన్నా హజారే ఒప్పుకున్నారు. దీంతో ఆయనకు నిమ్మరసం ఇచ్చిన ఫడ్నవీస్ దీక్ష విరమింపజేశారు. కాగా, దీక్ష చేయడంతో అన్నా హజారే ఐదు కిలోల బరువు తగ్గడంతో పాటు రక్తపోటు పడిపోయి నీరసించిపోయారు. 
anna hazare
padnavis

More Telugu News