Chandrababu: చంద్రబాబుకు అప్పు ఇవ్వడమంటే విజయ్ మాల్యాకు ఇచ్చినట్టే : వైసీపీ నేత భూమన

  • ఆ సంస్థలు ప్రజలను మోసం చేసినట్టు చంద్రబాబు కూడా చేస్తారు
  • అమరావతి అనే పీఠానికి చంద్రస్వామి పీఠాధిపతి
  • దోచుకోవడమే ధ్యేయంగా పనిచేస్తున్నారు  

రాజధాని అమరావతి నిర్మాణానికి ప్రజల నుంచి అప్పు తీసుకుంటానన్న సీఎం చంద్రబాబు వ్యాఖ్యలపై వైసీపీ అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. హైదరాబాద్ లోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో భూమన మాట్లాడుతూ, ప్రజలు సీఎం చంద్రబాబుకు అప్పు ఇవ్వడమంటే విజయ్ మాల్యాకు బ్యాంకులు అప్పు ఇచ్చినట్టేనని అన్నారు.

అగ్రిగోల్డ్, కేశవరెడ్డి సంస్థలు, చార్మినార్ బ్యాంకు ప్రజలను ఏవిధంగా దోచుకుని పరారయ్యాయో, చంద్రబాబుకు డబ్బులిచ్చినా అలానే జరుగుతుందని విమర్శించారు. అమరావతి అనే పీఠానికి చంద్రస్వామి అనే ఈ పీఠాధిపతి దోచుకోవడం, దాచుకోవడమే ధ్యేయంగా పనిచేస్తున్నారంటూ ఆరోపణలు గుప్పించారు. అలాంటి వ్యక్తి తమ పార్టీ అధినేత జగన్ పై, ఆయన వ్యక్తిత్వంపై ఆరోపణలు చేస్తారా? అని ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News