Mahesh Babu: 'భరత్ అనే నేను' ఆడియో వేదికగా ఎల్బీ స్టేడియం?

  • కొరటాల తాజా చిత్రంగా 'భరత్ అనే నేను'
  • మహేశ్ సరసన కైరా అద్వాని 
  • ఏప్రిల్ 7వ తేదీన ఆడియో రిలీజ్    
మహేశ్ బాబు అభిమానులంతా 'భరత్ అనే నేను' ఆడియో ఫంక్షన్ కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ వేడుకను వైజాగ్ లో జరుపుతారని కొన్ని రోజులు .. అక్కడి నుంచి విజయవాడకి మార్చారని కొన్ని రోజులు వార్తలు షికారు చేశాయి. అలాంటిదేం లేదు .. హైదరాబాద్ లోనే ఈ ఆడియో ఫంక్షన్ ఏప్రిల్ 7న జరుగుతుందని చెప్పారు.

అయితే వేదిక ఎక్కడ? అనే విషయంలో క్లారిటీ రావలసి వుంది. సాధారణంగా హైదరాబాద్ లో ఆడియో వేడుకలు శిల్పకళావేదిక .. హైటెక్స్ .. జెఆర్సీ కన్వెన్షన్ లలో ఎక్కువగా జరుగుతుంటాయి. అయితే అక్కడికి వచ్చే జనాన్ని కంట్రోల్ చేయడం కష్టమైపోతోందట. 'భరత్ అనే నేను' ఆడియో వేడుకకి కూడా భారీస్థాయిలో అభిమానులు వచ్చే అవకాశం ఉండటంతో, ఈ కార్యక్రమాన్ని ఎల్బీ స్టేడియంలో చేస్తే బాగుంటుందనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. త్వరలోనే ఈ విషయంలో స్పష్టత రానుంది.    
Mahesh Babu
kiara advani

More Telugu News