Actress Ileana D’Cruz: నా అనారోగ్యం గురించి చెప్పడానికి నేను సిగ్గుపడను!: ఇలియానా

  • 15 ఏళ్లుగా 'బాడీ డిస్‌మార్ఫిక్ డిజార్డర్ (బీడీడీ)'తో బాధపడుతున్న ఇలియానా
  • నన్ను అనారోగ్య స్థితిలో జనాలు చూడటం ఎక్కువగా బాధిస్తుంది
  • నా వ్యక్తిగత జీవితం పవిత్రం 
పదిహేనేళ్లుగా తాను బాధపడుతున్న 'బాడీ డిస్‌మార్ఫిక్ డిజార్డర్ (బీడీడీ)' గురించి బాహాటంగా చెప్పడానికి తానేమీ సిగ్గుపడనని గోవా ముద్దుగుమ్మ ఇలియానా అంటోంది. ఏదైనా ఓ విషయం గురించి మనం సిగ్గుపడితే దాన్ని బయటకు చెప్పడం చాలా కష్టమవుతుందని ఆమె అభిప్రాయపడింది. కానీ, తనను అలాంటి ఓ అనారోగ్య స్థితిలో జనాలు చూస్తే అదే ఎక్కువగా బాధిస్తుందని ఇలియానా తెలిపింది. మరోవైపు తన వ్యక్తిగత జీవితం చాలా పవిత్రమైందని ఆమె మరోసారి చెప్పుకొచ్చింది.

ప్రసార మాధ్యమాల్లో తన వ్యక్తిగత జీవితం గాసిప్‌లపాలు కావడం తనకు అస్సలు ఇష్టం లేదని నిర్మొహమాటంగా తేల్చిచెప్పింది. తన వ్యక్తిగత జీవితం చాలా పవిత్రమైందని, అందులో చాలా పార్శ్వాలు ఉన్నాయని ఆమె తెలిపింది. దాని గురించి తాను మాట్లాడితే అందులో వక్రీకరించబడిన విషయాల గురించి మాత్రమే జనాలు మాట్లాడుకుని మిగిలిన మంచి విషయాలను వదిలేస్తారని ఆమె అసహనం వ్యక్తం చేసింది. ఆస్ట్రేలియా ఫొటోగ్రాఫర్ ఆండ్రూ నీబోన్‌తో ఈ 'బర్ఫీ' భామ చాలాకాలంగా డేటింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే.
Actress Ileana D’Cruz
Andrew Kneebone
Body dysmorphic disorder

More Telugu News