varun tej: మెగా హీరో జోడీగా కొత్త కథానాయిక

  • అంతరిక్షం నేపథ్యంలో సంకల్ప్ రెడ్డి మూవీ 
  • వ్యోమగామి పాత్రలో వరుణ్ తేజ్ 
  •  సైంటిస్ట్ గా ప్రకాశ్ రాజ్

'ఫిదా' .. 'తొలిప్రేమ' సినిమాలతో అనూహ్యమైన విజయాలను సొంతం చేసుకున్న వరుణ్ తేజ్, హ్యాట్రిక్ హిట్ కొట్టాలనే ఉద్దేశంతో వున్నాడు. ఈ కారణంగానే పూర్తి వైవిధ్యభరితంగా అనిపించిన సంకల్ప్ రెడ్డి సినిమాకి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

 నగర శివార్లలో స్పేస్ సెంటర్ సెట్ ను భారీగా వేస్తున్నారట. చాలావరకూ ఈ సినిమా షూటింగు ఇందులోనే జరుగుతుందని అంటున్నారు. ఈ సినిమాలో ఒక కథానాయికగా అదితీరావును తీసుకున్నారు. మరో కథానాయికగా కావ్యా థాపర్ ఈ సినిమా ద్వారా పరిచయం కానుంది. ఇక కీలకమైన సైంటిస్ట్ పాత్ర ప్రకాశ్ రాజ్ పోషించనున్నాడని అంటున్నారు. వ్యోమగామిగా వరుణ్ తేజ్ నటిస్తోన్న ఈ సినిమాను, ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.      

More Telugu News