Hyderabad: బీజేపీ నేతలపై మండిపడ్డ టీడీపీ ఎంపీ కొనకళ్ల
- ప్రజల నుంచి తీసుకునే అప్పులను కాల్ మనీతో పోల్చుతారా?
- ప్రజల నుంచి అప్పులు తీసుకుంటే తప్పేంటి?
- బీజేపీ నేతలకు రాజకీయ అవగాహన లోపించింది
ప్రజల నుంచి అప్పులు తీసుకోవడాన్ని కాల్ మనీతో పోల్చడం బీజేపీ నేతల రాజకీయ అవగాహనా లోపానికి నిదర్శనమని టీడీపీ ఎంపీ కొనకళ్ల నారాయణ విమర్శించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, బీజేపీ నేతలకు తమను ప్రశ్నించే హక్కు లేదని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేనప్పుడు ప్రజల నుంచి అప్పులు తీసుకుంటే తప్పేంటని ప్రశ్నించారు. బ్యాంకుల నుంచి అప్పులు తెచ్చినా వడ్డీ కట్టాల్సిందేనని, అదే వడ్డీకి అదనంగా కలిపి ప్రజలకు ఇస్తామంటున్నామని కొనకళ్ల అన్నారు.
కాగా, ఇదే విషయమై బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ ఎమ్మెల్సీ బచ్చు అర్జునుడు మండిపడ్డారు. ప్రజల నుంచి అప్పు తీసుకుంటామంటే కాల్ మనీతో పోల్చడం సబబు కాదని, బీజేపీ దిగజారుడు తనానికి నిదర్శనం ఈ వ్యాఖ్యలని ఆగ్రహం వ్యక్తం చేశారు.