kalyan ram: బిత్తిరి సత్తికి వెరైటీ పాత్ర .. దశతిరిగిపోతుందట!

  • కల్యాణ్ రామ్ హీరోగా 'నా నువ్వే'
  • బిత్తిరి సత్తికి విభిన్నమైన పాత్ర 
  • మే 25వ తేదీన విడుదల  
బుల్లితెర ద్వారా బిత్తిరి సత్తికి వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. దాంతో సహజంగానే ఆయనకి వెండితెర నుంచి అవకాశాలు వస్తున్నాయి. తనకి నచ్చిన పాత్రలనే ఆయన చేసుకుంటూ వస్తున్నారు. అయితే వెండితెరపై ఇంతవరకూ ఆయనకి చెప్పుకోదగిన పాత్రలు పడలేదని చెప్పాలి. ఈ విషయంలో ఇప్పటివరకూ ఆయనకి ఉన్న నిరాశ .. త్వరలోనే తొలగిపోనుందని అంటున్నారు.

కల్యాణ్ రామ్ సినిమాలో ఆయనకి విలక్షణమైన పాత్ర పడిందని చెబుతున్నారు. కల్యాణ్ రామ్ .. తమన్నా కాంబినేషన్లో 'నా నువ్వే' సినిమా రూపొందుతోంది. ఇంతవరకూ చేసిన పాత్రలకి పూర్తి భిన్నమైన పాత్రలో బిత్తిరి సత్తి ఈ సినిమాలో కనిపిస్తాడని అంటున్నారు. ఈ సినిమాతో ఆయన దశ తిరిగిపోతుందనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. జయేంద్ర దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాను, మే 25వ తేదీన విడుదల చేయనున్నారు.  
kalyan ram
thamannah

More Telugu News