rangasthalam: ఈ రెస్టారెంటు పేరు 'రంగ‌స్థ‌లం'.. ఉచితంగా పబ్లిసిటీ!

  • హైదరాబాద్ శివారులోని కొంపల్లిలో రెస్టారెంట్
  • వైరల్ అవుతోన్న ఫొటో
  • చెర్రీ 'రంగస్థలం' సినిమా పేరే రెస్టారెంటుకు పెట్టిన వైనం

మెగా హీరో రామ్ చరణ్ తేజ్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్‌లో రూపుదిద్దుకున్న‘రంగస్థలం’ సినిమా విడుద‌ల‌కు సిద్ధ‌మైన విష‌యం తెలిసిందే. కాగా, ‘రంగస్థలం’ పేరిట హైదరాబాద్ శివారులోని కొంపల్లిలో ఓ రెస్టారెంట్ పెట్టినట్లు తెలిసింది. మెగా అభిమానులు #Rangasthalam పేరిట ట్విట్టర్‌లో ఈ సినిమా విశేషాలను పంచుకుంటున్న సందర్భంగా, ఓ అభిమాని ఈ విషయాన్ని వెల్లడించాడు.  

  ‘రంగస్థలం’ పేరుతో తమ ఇంటి పరిసరాల్లో ఈ రెస్టారెంటు వెలిసిందని తెలిపాడు. దీంతో ఈ రెస్టారెంటు ఫొటో తెగ వైరల్ అవుతోంది. దానికి ఉచితంగా పబ్లిసిటీ వచ్చేస్తోంది. ఆ రెస్టారెంటు యజమాని చెర్రీ సినిమా పేరు (రంగస్థలం) నే తన రెస్టారెంటుకు పెట్టాడో లేక ఈ పేరు వెనుక పెద్ద కథే ఉందో తెలియదు కానీ, మొత్తానికి ‘రంగస్థలం’ రెస్టారెంట్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కొంపల్లిలోని ఓ షాపింగ్‌ మాల్‌లోని మొదటి అంతస్తులో ఈ రెస్టారెంటు ఉంది. 

  • Loading...

More Telugu News